చెట్టు ఢీకొన్న కారు.. స్పాట్ లోనే ఇద్దరు మృతి
స్పాట్ వాయిస్, క్రైమ్ : ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామం వద్ద బుధవారం రాత్రి 9 గంటలకు కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన యువకులు ఏడు మంది ఉన్నట్టు గుర్తించారు. అందులో ఇద్దరు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ధర్మసాగర్ రిజర్వాయర్ కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏనుగులా… శివ… లోకేష్ గా గుర్తించారు. మరో వ్యక్తి సైతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

