ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeతెలంగాణజయశంకర్ భూపాలపల్లిజయశంకర్ జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీ

జయశంకర్ జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీ

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, గణపురం :జయశంకర్ జిల్లాలో మంగళవారం ఒకే సారి 9 మంది పోలీసు ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు విడుదల చేశారు. మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ గణపురం ఎస్సైగా, టేకుమట్ల ఎస్సై డి సుధాకర్ రేగొండ ఎస్సైగా, చిట్యాల ఎస్సై జి శ్రావణ్ కుమార్ భూపాలపల్లి సెకండ్ ఎస్సైగా, గణపురం ఎస్సై ఆర్ అశోక్ భూపాలపల్లి వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు, కొత్తపల్లి గోరి ఎస్సై ఎస్ దివ్య భూపాలపల్లి వీఆర్ ఎస్సై గా, ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్ లో ఉన్న ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి కొత్తపల్లిగోరి ఎస్సైగా, వీఆర్ లో ఉన్న ఎస్సై పి సతీష్ చిట్యాల ఎస్సైగా, ప్రస్తుతం ములుగులో వీఆర్ లో ఉన్న ఎస్సై ఎం సురేష్ మొగుళ్లపల్లి ఎస్సైగా నియామకo అయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular