వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల జోలికొస్తే ఊరుకోం
కడియం కమిట్మెంట్ ఏమైంది.. ఎమ్మెల్యే నాయిని మొసలి కన్నీరు కారుస్తున్నారు పేదల పొట్టకొట్టొద్దు.. గుడిసెవాసుల పక్షాన పోరాడతాం ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్పాట్ వాయిస్, కాజీపేట: వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల సమస్యపై బీఆర్ఎస్ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్పందించారు. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాలుగా అక్కడ పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని, వారికి అన్యాయం చేయొద్దని అన్నారు. తాను ఎప్పుడూ పేదల పక్షపాతినేనని, కొందరు లిల్లీపుట్ నాయకులు తనపై చిల్లర విమర్శలు...