SPOT VOICE
Newspaper Banner
Date : 04 November 2026, 11:55 am Posted By : SPOT VOICE MEDIA

వంద పడకల ఆసుపత్రిలో విద్యుత్ కష్టాలు..!

  • గంటల తరబడి కరెంటు లేక రోగుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు..?
  • స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, ఇన్‌పేషెంట్లు, వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు. కరెంటు కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరం పునరావృతమవుతున్నా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ పరిస్థితి కొనసాగడం పట్ల రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వంద పడకల ఆసుపత్రిలోనే విద్యుత్ సమస్యలు ఇంత తీవ్రంగా ఉంటే అత్యవసర వైద్య సేవల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.