SPOT VOICE
Newspaper Banner
Date : 17 October 2026, 1:23 pm Posted By : SPOT VOICE MEDIA

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను కలిసిన నీలం మధు

స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్‌ శనివారం నార్సింగిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను శాలువాతో సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు నమోదు ప్రక్రియ, పార్టీ నాయకులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నీలం మధుకు పలు కీలక సూచనలు చేశారు. పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని సూచించారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్‌ టీపీసీసీ అధ్యక్షుడికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకత్వం సూచనల మేరకు ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాల్సిన అవసరంపై ఈ భేటీలో చర్చించారు.