ముదిరాజ్ సంఘం పెద్దమనుషులుగా తెప్ప స్వామి, రవీందర్

స్పాట్ వాయిస్,కమలాపురం: కమలాపురం మండలంలోని గూడూరు గ్రామ ముదిరాజ్ సంఘం నూతన పెద్దమనుషులుగా తెప్ప స్వామి, కుక్కల రవీందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన పెద్దమనుషులు సంఘం అభివృద్ధికి, సభ్యుల ఐక్యతకు కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.