జయశంకర్ భూపాలపల్లి జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే అసోసియేషన్ లక్ష్యం: పంతకాని సమ్మయ్య
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జిల్లా క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ లక్ష్యమని అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సింగరేణి అంబేద్కర్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూతల సమ్మయ్య సమన్వయంతో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 350 మంది బాలబాలికలు పాల్గొన్నారు. అండర్–14, అండర్–16 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అండర్–14లో ట్రయాథ్లాన్ ఏ, బి, సి గ్రూపుల్లో పరుగు, లాంగ్ జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో అంశాల్లో పోటీలు జరిగాయి. అండర్–16లో లాంగ్ జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టి కరుణాకర్ హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. పట్టుదలతో సాధన చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు జాగరి అజయ్, పరస శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. సారంగపాణి, ట్రెజరర్ సూదం సాంబమూర్తి, కార్యవర్గ సభ్యులు జి. పూర్ణిమ, జితేందర్, పసుల రవికుమార్, మమత, ఉమా, శ్రీవిద్య, హేమలత, గాజర్ల శ్రీనివాస్, రవళి, సృజన, కోచ్‌లు లక్ష్మణ్, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.
