SPOT VOICE
Newspaper Banner
Date : 06 October 2026, 7:37 pm Posted By : SPOT VOICE MEDIA

సీనియర్ ఆర్ఎంపీ వెంకటేశ్వర్లు కన్నుమూత

స్పాట్ వాయిస్, నర్సంపేట:  నర్సంపేటకు చెందిన సీనియర్ ఆర్ఎంపీ, ఆర్ఎంపీల  మండల మాజీ అధ్యక్షుడు వర్దెల్లి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వర్లు మృతి పట్ల ఆర్ఎంపీలు, వైద్య వర్గాలు, సన్నిహితులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.