SPOT VOICE
Newspaper Banner
Date : 25 October 2026, 7:14 pm Posted By : SPOT VOICE MEDIA

ములుగు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా సతీష్‌రెడ్డి

 

ములుగు, స్పాట్ వాయిస్: ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధ్యక్ష పదవికి పోటీ ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో సతీష్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి సీతక్క సూచించిన వ్యక్తికే అధ్యక్ష పీఠం దక్కడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్నికకు ముందు బాదం ప్రవీణ్‌ను సీబీసీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారన్న పరిణామం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నిక ఏకగ్రీవం కావడం వెనుక రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది.