రేగొండ వారాహి దేవి ఆలయంలో ఘనంగా మాలాధారణ
స్పాట్ వాయిస్ రేగొండ: రేగొండ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ శ్వేత లక్ష్మి వారాహి దేవి ఆలయం, శ్రీశ్రీశ్రీ విశ్వామిత్ర ఆనందనాద యోగాశ్రమం (సిద్ధ పీఠం)లో దుర్గా శరన్నవరాత్రుల సందర్భంగా దీక్ష మాలాధారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉపాసకులు దాసరి వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్వాములు మాలాధారణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పున్నం రవి, మాజీ ఎంపీటీసీ మైస బిక్షపతి,...