SPOT VOICE
Newspaper Banner
Date : 11 October 2026, 5:45 pm Posted By : SPOT VOICE MEDIA

రేగొండ వారాహి దేవి ఆలయంలో ఘనంగా మాలాధారణ

 

స్పాట్ వాయిస్ రేగొండ: రేగొండ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ శ్వేత లక్ష్మి వారాహి దేవి ఆలయం, శ్రీశ్రీశ్రీ విశ్వామిత్ర ఆనందనాద యోగాశ్రమం (సిద్ధ పీఠం)లో దుర్గా శరన్నవరాత్రుల సందర్భంగా దీక్ష మాలాధారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉపాసకులు దాసరి వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్వాములు మాలాధారణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పున్నం రవి, మాజీ ఎంపీటీసీ మైస బిక్షపతి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు గుర్రాల సుమన్ రెడ్డి, ఉపసర్పంచ్ వెల్దండి నరేష్, జర్నలిస్టు మంతెన సురేష్, సామల సురేందర్ రెడ్డి, కందుకూరి కృష్ణ, దేవకారి ప్రతాప్, ఆసాల నరసింహారావు, ఎర్రబాటి శివ, బోడికల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.