స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో మంగళవారం సాయంత్రం విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. భారీ రావణాసురుడి ప్రతిమను దహనం చేయడంతో మైదానం పండుగ శోభను సంతరించుకుంది.ఈ వేడుకలకు శాసన మండలి ఉపసభాపతి బండా ప్రకాష్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ ఎం. శ్వేత, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అతిథులు ఎమ్మెల్యే కొండా సురేఖతో కలిసి ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసి రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయదశమి వేడుకలను తిలకించేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రావణ దహనంతో మైదానం సందడిగా మారగా, పండుగ సంబరాలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి.