నర్సంపేటలో భారీ అగ్నిప్రమాదం..

రెండు దుకాణాలు దగ్ధం.. రూ.80 లక్షల ఆస్తి నష్టo.. స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్‌ ప్రధాన కూడలిలో నెహ్రూ విగ్రహం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.80 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు ఘటనాస్థలాన్ని సందర్శించి బాధిత...