SPOT VOICE
Newspaper Banner
Date : 20 October 2026, 1:56 pm Posted By : SPOT VOICE MEDIA

సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక పూజలు

స్పాట్ వాయిస్, పాలకుర్తి : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తి మండలంలోని ప్రసిద్ధ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామివారిని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.