మీ సేవా నిర్వాహకుల సమస్యల పరిష్కారానికి కృషి
టి.జి.ఎం.ఎఫ్ వరంగల్ జిల్లా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బైరా శంకర్ స్పాట్ వాయిస్, వరంగల్, అక్టోబర్ 25: తెలంగాణ మీ సేవా ఫెడరేషన్ (టి.జి.ఎం.ఎఫ్) వరంగల్ జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు (వీఎల్ఈలు) ఎదుర్కొంటున్న సమస్యలు, కమీషన్లు, నూతన సేవలు, ఆరోగ్య బీమా, సంక్షేమం, ఆర్థిక భద్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి టి.జి.ఎం.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బైరా శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ మోహీద్, జిల్లా అధ్యక్షుడు...