టేకుమట్ల, స్పాట్ వాయిస్: టేకుమట్ల మండలం ఎంపెడ్ గ్రామంలో కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శోభాయాత్ర వైభవంగా సాగింది. ఉత్సవ కమిటీ సభ్యులు, భవాని మాలధారణ స్వాములు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో ఎంపెడ్ గ్రామంతో పాటు టేకుమట్ల మండలం, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు.
