చివరి ఆయకట్టుకు అందని సాగునీరు..
ఎండిపోతున్న వరి పొలాలు. స్పాట్ వాయిస్ మల్హర్:మండలంలోని బొగ్గుల వాగు ప్రాజెక్టు కాలువ నీరు చివరి ఆయకట్టు వరకు అందకపోవడంతో చేతికొచ్చిన పంటలు కళ్ళముందే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బొగ్గుల వాగు ప్రాజెక్టు నుండి వచ్చే కాలువలు ఎక్కడికక్కడ తుంగ, నాచుతో నిండిపోయి, అక్కడక్కడ గండ్లు పడి సాగునీరు చివరి వరకు పారడం కష్టంగా మారింది. దీంతో చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎడ్లపల్లి కొయ్యూరు ప్రధాన రహదారి పక్కన వల్లెంకుంట గ్రామానికి చెందిన రైతులు గడిపెల్లి సమ్మరాజు, కొండ్ర...