భూపాలపల్లి కాసింపల్లి శివారులో మట్టి దందా..
అధికారులకు కనిపించడం లేదా? జేసీబీలతో తవ్వకాలు.. ట్రాక్టర్లతో తరలింపులు! ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రశ్నలు స్పాట్ వాయిస్, భూపాలపల్లి:భూపాలపల్లి పట్టణంలోని కాసింపల్లి శివారులో ప్రభుత్వ భూముల నుంచి మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జేసీబీలతో మట్టిని తవ్వి, ట్రాక్టర్ల ద్వారా పట్టణంలోని వెంచర్లకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 ట్రాక్టర్లతో వందలాది ట్రిప్పుల మట్టి తరలించినట్లు సమాచారం. తవ్వకాలతో భూమి పెద్దపెద్ద గుంతలుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ భూముల్లో ఇంత భారీగా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారుల...