SPOT VOICE
Newspaper Banner
Date : 25 October 2026, 5:24 pm Posted By : SPOT VOICE MEDIA

భూపాలపల్లి కాసింపల్లి శివారులో మట్టి దందా..

 అధికారులకు కనిపించడం లేదా?

జేసీబీలతో తవ్వకాలు.. ట్రాక్టర్లతో తరలింపులు!

ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రశ్నలు

స్పాట్ వాయిస్, భూపాలపల్లి:భూపాలపల్లి పట్టణంలోని కాసింపల్లి శివారులో ప్రభుత్వ భూముల నుంచి మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జేసీబీలతో మట్టిని తవ్వి, ట్రాక్టర్ల ద్వారా పట్టణంలోని వెంచర్లకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 ట్రాక్టర్లతో వందలాది ట్రిప్పుల మట్టి తరలించినట్లు సమాచారం. తవ్వకాలతో భూమి పెద్దపెద్ద గుంతలుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ భూముల్లో ఇంత భారీగా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారుల పర్యవేక్షణ ఏదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? మట్టి తరలింపు వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.సంబంధిత రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, తవ్వకాలపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.