SPOT VOICE
Newspaper Banner
Date : 21 October 2026, 5:24 pm Posted By : SPOT VOICE MEDIA

విద్యుత్ షాక్‌తో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ మృతి

 

బల్బు సరిచేస్తుండగా ప్రమాదం.. కుటుంబంలో విషాదం

టేకుమట్ల, స్పాట్ వాయిస్: విద్యుత్ షాక్‌కు గురై గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆకులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాసరవేణి కుమార్ (42) విద్యుత్ స్తంభంపై బల్బును సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. వెంకట్రావుపల్లి గ్రామానికి అనుబంధంగా ఉన్న ఆకులపల్లిలో రాగుల పెద్ద రవి ఇంటి సమీపంలోని విద్యుత్ స్తంభంపై బల్బు పనిచేయకపోవడంతో కుమార్ దాన్ని బాగు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటి టెర్రస్‌పైకి ఎక్కి కర్ర సహాయంతో బల్బును సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం.మృతుడి భార్య కాసరవేణి కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అమూల్య తెలిపారు. గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న కుమార్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.