SPOT VOICE
Newspaper Banner
Date : 21 October 2026, 7:18 am Posted By : SPOT VOICE MEDIA

శమీ పూజలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ దంపతులు

 

స్పాట్ వాయిస్, మంథని: విజయదశమి సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌, శైలజ దంపతులు మంగళవారం సాయంత్రం మంథని కోర్టు సమీపంలోని జమ్మి చెట్టు వద్ద నిర్వహించిన శమీ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ పాండవులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు శ్రీరాముడి విజయానికి జమ్మి చెట్టు ప్రతీకగా నిలుస్తుందని, అందుకే విజయదశమి రోజున శమీ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. విజయదశమి ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణ ప్రజలు, అభిమానులు ఆయనకు శమీ ఆకులు అందించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.