SPOT VOICE
Newspaper Banner
Date : 11 October 2026, 1:36 pm Posted By : SPOT VOICE MEDIA

ఖాసింపల్లిలో కుటుంబ కలహాలు.. చిన్నారికి తీవ్ర గాయం

 

స్పాట్ వాయిస్, భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలోని ఖాసింపల్లిలో కుటుంబ కలహాలు దాడికి దారితీశాయి. ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో ఏడాది వయసున్న నైసీ తలకు తీవ్ర గాయమై, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మోకిడి సురేష్, మోకిడి తిరుపతికి కూడా గాయాలయ్యాయి. మోకిడి సంజీవ్, అతని కుటుంబ సభ్యులు, అనుచరులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.