ఎల్‌నినో ఎఫెక్ట్.. సర్కారుకు సెగ..!
ఎండుతున్న చెరువులు.. కరెంటు కోతలతో రైతుల గోస పొట్ట దశలో పంటలు.. కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకపోవడంపై ప్రశ్నలు భట్టి నేతృత్వంలో సబ్‌కమిటీ.. అన్నదాతకు ఊరట ఎప్పుడో? స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి: ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు ఎడారులుగా మారుతున్న చెరువులు.. ఇంకోవైపు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై రైతుల ఆందోళన. పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్న వేళ రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు...