స్పాట్ వాయిస్, తొర్రూర్ : తొర్రూరు పట్టణంలోని ఎతరాజరావు పార్కులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా రావణ దహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం రావణుడి దిష్టిబొమ్మకు నిప్పంటించారు. ఎమ్మెల్యేను మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు గజమాలతో సత్కరించారు. కార్యక్రమానికి సహకరించిన దాతలను శాలువాలతో అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలంతా సత్యం, ధర్మం, న్యాయం మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.