కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు: గంట రవికుమార్

  స్పాట్ వాయిస్, వరంగల్:: కాంగ్రెస్ ప్రభుత్వ  అనాలోచిత విధానాలతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగిపోయాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు. అధికారంలోకి వస్తే రైతులకు స్వర్గధామం చేస్తామని హామీ ఇచ్చి, నేడు అన్నదాతలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తిమ్మాపురం క్రాస్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.