SPOT VOICE
Newspaper Banner
Date : 13 October 2026, 6:29 pm Posted By : SPOT VOICE MEDIA

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వండి

రాహుల్‌గాంధీకి పెరుమాండ్ల రామకృష్ణ విజ్ఞప్తి

స్పాట్ వాయిస్, బ్యూరో : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిసి తన బయోడేటాను అందజేశారు. రాష్ట్రంలోని మాదిగ, దళిత, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ సంఘాలతో పాటు ఉద్యోగ, ప్రజా, ఉద్యమకారుల సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరుతున్న విషయాన్ని రాహుల్‌గాంధీకి వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పార్టీ ముఖ్య నాయకులను కలిసి రామకృష్ణకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను రాహుల్‌గాంధీకి అందజేశారు. తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రాహుల్‌గాంధీకి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.