రాకేష్ రెడ్డి–రంజిత్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌..!

  స్పాట్ వాయిస్, హన్మకొండ :హనుమకొండ జిల్లా బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం వేదికగా రాకేష్ రెడ్డి, దుగ్గింపూడి రంజిత్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరైన సమావేశంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. రాకేష్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రంజిత్ రెడ్డి వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు...