SPOT VOICE
Newspaper Banner
Date : 16 October 2026, 2:56 pm Posted By : SPOT VOICE MEDIA

నిడిగొండ వద్ద రోడ్డు ప్రమాదం..

యువకుడికి తీవ్ర గాయాలు

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బైక్‌పై పండుగకు తన స్వగ్రామానికి వెళ్తున్న ఓ యువకుడు మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యాడు. నిడిగొండ వద్ద వేగంగా వెళ్తున్న బైక్‌ లారీని ఢీకొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాధితుడికి సహాయం అందించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.