SPOT VOICE
Newspaper Banner
Date : 08 September 2026, 10:08 am Posted By : SPOT VOICE MEDIA

ఇసుక అక్రమ రవాణా ఆపాలంటూ మహిళల ఆందోళన

స్పాట్ వాయిస్, మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిత్యం ఇసుక లారీల రాకపోకలతో రహదారులు దెబ్బతినడంతో పాటు గ్రామ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న అధికారులు సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.