వరంగల్: పటేల్ విగ్రహానికి పాలతో శుద్ధి

స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం కాశీబుగ్గ వెంకట్రామ థియేటర్ జంక్షన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పాలతో శుద్ధి చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకపోవడం అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ చరిత్రను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.