SPOT VOICE
Newspaper Banner
Date : 13 September 2026, 7:52 pm Posted By : SPOT VOICE MEDIA

వరంగల్ ఈస్ట్ టికెట్ నాదే..: మాజీ మంత్రి కొండా

స్పాట్ వాయిస్ ,వరంగల్: వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్‌ వస్తుందని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ రాకపోవడంతో కేసీఆర్‌ పిలిచి వరంగల్‌ ఈస్ట్‌ టికెట్‌ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో అప్పటి మంత్రిని ఓడించామని చెప్పారు. తాము గెలిచినందుకే వరంగల్‌ ఈస్ట్‌లో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కొండా మురళి అండగా ఉన్నారనే ధైర్యం ప్రజల్లో ఉందన్నారు. మళ్లీ ప్రభుత్వంలోకి వచ్చి తాను మంత్రి పదవి చేపడతానని సురేఖ ప్రకటించారు.