వినయ్‌భాస్కర్‌ను ఎదుర్కోలేక మమ్మల్ని బతిమాలారు: నాయినికి సురేఖ కౌంటర్

స్పాట్ వాయిస్ ,వరంగల్: తనపై విమర్శలు చేస్తున్న నాయిని రాజేందర్‌రెడ్డికి కొండా సురేఖ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గతంలో దాస్యం వినయ్‌భాస్కర్‌ను ఎదుర్కోలేక నియోజకవర్గ కార్యక్రమాలకు తమను బతిమాలి తీసుకెళ్లేవారని అన్నారు. భద్రకాళి ఆలయ పదవి విషయంలో హంగామా చేసిన నాయిని, వెంకట్‌రెడ్డి పదవి పోయినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మైక్‌ కనిపించగానే కొందరు నాయకులు రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయంగా తమపై మాట్లాడే ముందు తమ అనుచరులపై గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.