ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి
సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం స్పాట్ వాయిస్, గణపురం:సమాజ నిర్మాణంలో, విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు...