స్పాట్ వాయిస్, భూపాలపల్లి: బీఆర్‌ఎస్ నాయకులు అసెంబ్లీ గౌరవాన్ని కాపాడకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బీఆర్‌ఎస్ వైఖరిపై నాయకులు మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాస్ అన్నారు. దళితులపై అవమానకర చర్యలను ఖండిస్తూ సామాజిక వివక్షను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బట్టి కరుణాకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.