చెన్నాపూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
స్పాట్ వాయిస్, రేగొండ: చెన్నాపూర్ శివారులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు–బైక్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరిని నారాయణపూర్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.