స్పాట్ వాయిస్, నల్లబెల్లి: నల్లబెల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా మిట్టగడపల సాంబయ్య (సాక్షి), ప్రధాన కార్యదర్శిగా సట్ల రమేష్‌గౌడ్ (ఆంధ్రజ్యోతి), గౌరవ అధ్యక్షుడిగా చిర్ర రమేష్ (జనం సాక్షి), కోశాధికారిగా గంగిశెట్టి నాగభూషణ్ (వార్త), ఉపాధ్యక్షుడిగా సామల వీరన్న (నవతెలంగాణ) ఎన్నికయ్యారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధ్యక్షుడు సాంబయ్య తెలిపారు. సభ్యులుగా సాంబమూర్తి, మొగిలి కుమారస్వామి, గండు శ్రీధర్, రామిని నాగరాజు, మహేష్, బిక్షపతి, ప్రవీణ్ పాల్గొన్నారు.