ఎనిదేళ్ల తరువాత ఆర్టీసీలో ఎన్నికల నగారా..
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత టీజీఎస్ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 21 నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా వచ్చే నెల 9న ఎన్నికలు, అదే నెల 17న ఫలితాలు విడుదల కానున్నాయి.. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీలో మెజారిటీ కార్మిక సంఘాన్ని తేల్చేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ లేబర్ జాయింట్ కమిషనర్ శుక్రవారం షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబర్ 9న రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కాగా చివరిసారిగా 2016 జూలై 19న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి.
* సెప్టెంబర్ 22న డిపో మేనేజర్ల ద్వారా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లాల డిప్యూటీ రిటర్నింగ్ అధికారులకు సమర్పించడం, సంఘాల నుంచి అభ్యంతరాలు కోరడం.
* సెప్టెంబర్ 24న డిప్యూటీ రిటర్నింగ్ అధికారుల వద్ద అభ్యంతరాల దాఖలు
* సెప్టెంబర్ 25న అభ్యంతరాల పరిశీలన, తుది ఓటర్ల జాబితా ఖరారు.
* సెప్టెంబర్ 26న పోటీ చేసే సంఘాలకు తుది ఓటర్ల జాబితా అందజేత, గుర్తుల కేటాయింపు
* సెప్టెంబర్ 29న సంఘాలు డిప్యూటీ రిటర్నింగ్ అధికారుల నుంచి డమ్మీ బ్యాలెట్ పత్రాలను సేకరణ.
* అక్టోబర్ 9న ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణ
* అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతాయి.
* అక్టోబర్ 17న ఎన్నికల ఫలితాల ప్రకటన.