రేగొండ మండల వార్డు సభ్యుల ఇన్‌చార్జిగా రేసోజు శివరాజ్

స్పాట్ వాయిస్, రేగొండ: తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగవెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు రేగొండ మండల కమిటీ నిర్మాణానికి సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి బోయిని శ్రీజ రజినికుమార్ ఆధ్వర్యంలో, భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ రేణికుంట్ల రమణకుమార్, కో-కన్వీనర్ మారపల్లి కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. మండల ఇన్‌చార్జిగా రేసోజు శివరాజ్‌ను నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు నాగవెల్లి జ్యోతి, బోయిని శ్రీజ రజినికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు.