రాజాజీ నగర్ గణపతికి ఘన వీడ్కోలు
ముగిసిన వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాలు కాలనీలో ఘనంగా శోభాయాత్ర కోలాటాలు, మంగళహారతులతో మహిళల స్వాగతం స్పాట్ వాయిస్, హన్మకొండ : హన్మకొండ 52వ డివిజన్ పరిధి రాజాజీనగర్ లో శ్రీ వరసిద్ధి వినాయక గజానన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రోత్సవాలు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు శ్రీ వరసిద్ధి వినాయక గజానన మండలి ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయకుడికి ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. కాలనీలో పలు వీధుల్లో వినాయకుడిని ఊరేగించగా, మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి...