ముగిసిన వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాలు
కాలనీలో ఘనంగా శోభాయాత్ర
కోలాటాలు, మంగళహారతులతో మహిళల స్వాగతం
స్పాట్ వాయిస్, హన్మకొండ : హన్మకొండ 52వ డివిజన్ పరిధి రాజాజీనగర్ లో శ్రీ వరసిద్ధి వినాయక గజానన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రోత్సవాలు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు శ్రీ వరసిద్ధి వినాయక గజానన మండలి ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయకుడికి ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. కాలనీలో పలు వీధుల్లో వినాయకుడిని ఊరేగించగా, మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 8 ఏళ్లుగా ఆదిదేవుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని, ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ నవరాత్రులు వినాయకుడికి భక్తిశ్రద్ధలతో అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలు, అన్నదానం, మహిళలకు, చిన్నపిల్లలకు వివిధ పోటీలు నిర్వహించామన్నారు. ఇలాగే వచ్చే ఏడాది కూడా కాలనీవాసులమంతా ఐక్యమత్యంతో ఉంటూ ఇంతకంటే వైభవంగా వినాయక నవరాత్రోత్సవాలు నిర్వహించేలా చూడాలని, వరసిద్ధి గణనాథుడి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దేవుడిని వేడుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమాల్లో శ్రీ వరసిద్ధి వినాయక గజానన మండలి సభ్యులు, కాలనీ పెద్దలు వడ్లకొండ రవీందర్, కృష్ణ ప్రసాద్, చాడ జనార్ధన్ రెడ్డి, గోలి సురేందర్ రెడ్డి, అచ్చ జగదీశ్వర్, సాగుల బాలరాజు, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజేశ్వర్ రావు, సంజీవరావు, శ్రీనివాస రావు, శంకర్ రెడ్డి, కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి, ఘనంగా వీడ్కోలు పలికారు.
