కృష్ణాష్టమి సెలవును పట్టించుకోని ప్రైవేట్‌ స్కూళ్లు!

స్పాట్‌ వాయిస్‌, నల్లబెల్లి: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన జనరల్‌ హాలిడేను నల్లబెల్లి మండలంలోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు పట్టించుకోకుండా తరగతులు నిర్వహించడంపై బీజేవైఎం నాయకుడు సుధగని ప్రమోద్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక క్రిస్టియన్‌ పాఠశాల సెలవు పాటిస్తుండగా, మరో రెండు హిందూ యాజమాన్య పాఠశాలలు మాత్రం కొనసాగించడం పట్ల ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సెలవులు అందరికీ సమానంగా వర్తించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.