SPOT VOICE
Newspaper Banner
Date : 07 September 2026, 12:50 pm Posted By : SPOT VOICE MEDIA

పేదల పెన్షన్లు.. ఇందిరమ్మ ఇళ్లు ఏవీ?

స్పాట్ వాయిస్,  భూపాలపల్లి,: కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనలో అర్హులైన పేదలకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు అందలేదని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఈ అంశాలపై సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌లో బీఆర్‌ఎస్‌ సమరభేరి నిర్వహించనుంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కలెక్టర్‌కు అందజేయనున్నారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల పెన్షన్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలు కార్యక్రమంలో పాల్గొనాలని బీఆర్‌ఎస్‌ నాయకులు పిలుపునిచ్చారు. అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడుతామని తెలిపారు.