బిడ్డతో సంబంధం లేదన్న మురళి.. సుస్మిత ఎటువైపు?
స్పాట్ వాయిస్, బ్యూరో : పరకాల రాజకీయాల్లో కొండా సుస్మిత అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో పరకాల నుంచి సుస్మిత పోటీ చేస్తారని కొండా మురళి ప్రకటించగా, తాజాగా ఆమెతో తనకు సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఒకవైపు కాంగ్రెస్‌లో పరకాల అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరు ఖరారవడం, మరోవైపు కొండా కుటుంబం నుంచి సుస్మిత విషయంలో భిన్న సంకేతాలు వెలువడటం ఆసక్తి రేపుతోంది. ఇంతకాలం సుస్మితను రాజకీయ వారసురాలిగా ప్రస్తావించిన మురళి ఇప్పుడు వెనక్కి...