SPOT VOICE
Newspaper Banner
Date : 22 September 2026, 9:10 pm Posted By : SPOT VOICE MEDIA

పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి

స్పాట్ వాయిస్, హన్మకొండ: నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ నేత, మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు అవకాశం కల్పించాలని విద్యావంతుల వేదిక (ఎంవీవీ) కన్వీనర్, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండలో ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి రామకృష్ణ కృషి చేశారని తెలిపారు. రామకృష్ణ ఆసుపత్రి ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని, కే-మ్యాక్స్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, రామకృష్ణకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ అవకాశం సాధ్యం కాకపోతే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాది, అసైన్డ్ భూమి సమితి అధ్యక్షుడు కలకోటి మహేందర్, దళిత సంఘాల నాయకులు మోరే ఐలయ్య, పోలేపాక రాము తదితరులు పాల్గొన్నారు.