
-
ఫిబ్రవరి 17 నుండి 20 వరకు
స్పాట్ వాయిస్, వరంగల్ : తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మల మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి.
పూజారుల ప్రకటన ప్రకారం 2027 ఫిబ్రవరి 17, బుధవారం నుంచి ఫిబ్రవరి 20, శనివారం వరకు నాలుగు రోజుల పాటు మేడారం మినీ జాతర నిర్వహించనున్నారు. ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మలను గిరిజన సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం కొలుస్తూ ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే ఈ జాతర సందర్భంగా మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడనుంది.