SPOT VOICE
Newspaper Banner
Date : 07 September 2026, 10:24 am Posted By : SPOT VOICE MEDIA

చలో అసెంబ్లీకి బ్రేక్‌.. గంట రవికుమార్‌ హౌస్‌ అరెస్ట్‌

స్పాట్ వాయిస్, వరంగల్ :  విద్యార్థుల పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ అన్నారు. కార్యక్రమంలో పాల్గొనకుండా మిల్స్‌ కాలనీ పోలీసులు శివనగర్‌లోని తన నివాసంలో హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.