కుడా చైర్మన్ సుధారాణికి మంత్రి పొన్నం అభినందనలు

స్పాట్ వాయిస్, హైదరాబాద్: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ( కుడా) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన గుండు సుధారాణి సోమవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం గుండు సుధారాణిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ సందర్భంగా కుడా పరిధిలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేలా సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. కుడా చైర్మన్‌గా గుండు...