SPOT VOICE
Newspaper Banner
Date : 19 September 2026, 9:04 am Posted By : SPOT VOICE MEDIA

జన్వాడ ఫామ్ హౌస్ భూమి నాదే..

కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు
ప్రదీప్ రెడ్డి
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : జన్వాడ ఫార్మ్ హౌస్ భూములు తన సొంత ఆస్తి అని, ఆ భూములతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు చిన్నప్పటి నుంచి స్నేహితుడని తెలిపారు. ఫార్మ్ హౌస్ భూములకు చట్టబద్ధమైన క్లియర్ టైటిల్ ఉందని, ఎలాంటి వివాదాలు లేవని, తన సొంత ప్రాపర్టీ అయిన జన్వాడ ఫార్మ్ హౌస్‌ను కేటీఆర్‌కు లీజుకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అధికారులకు ఏమైనా సందేహాలుంటే తనను సంప్రదించవచ్చన్నారు.. నోటీసులు జారీ చేసి వివరణ కోరితే అందుకు సంబంధించిన వివరాలు, సంబంధిత పత్రాలను చట్టపరమైన విధానంలో సమర్పించేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. వ్యక్తిగత ఆస్తిని రాజకీయ పార్టీల నేతలు పరిశీలిస్తామంటూ రాజకీయ వివాదం చేయడం సరికాదని ప్రదీప్ రెడ్డి అన్నారు.