SPOT VOICE
Newspaper Banner
Date : 08 September 2026, 11:34 am Posted By : SPOT VOICE MEDIA

హౌస్ అరెస్ట్ అక్రమం..

స్పాట్ వాయిస్, హన్మకొండ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కేసీఆర్ దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేసి, బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే చర్యలను సహించబోమని, దళితులు, పేదలు, అణగారిన వర్గాల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు.