చాపకింద నీరులా హెచ్1ఎన్1 వైరస్
స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణలో ఇన్‌ఫ్లుయెంజా ఏ (హెచ్1ఎన్1) కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేసుల తాకిడి కనిపిస్తోంది. కొందరిలో వైరస్ తీవ్ర న్యుమోనియాకు దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో హెచ్1ఎన్1తో ఓ రోగి మృతి చెందినట్లు సమాచారం ఉన్నా, వైద్యారోగ్య శాఖ ధ్రువీకరించలేదు. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, గుండె సమస్యలున్న వారికి ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, తుమ్ముల తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది....